Header Banner

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

  Tue Feb 25, 2025 13:48        Politics

ఎలాంటి మెసేజ్‌ రాలేదు.? ఎవరికీ డబ్బులు పంపించలేదు. కానీ ఖాతా నుంచి రూ 236 కట్‌ అయ్యాయి. ఇది గత కొన్ని రోజులుగా ఎస్‌బీఐ అకౌంట్ హోల్డర్స్‌ గమనిస్తున్న విషయం. అయితే ఎస్‌బీఐ ఖాతా నుంచి డబ్బులు ఎందుకు కట్‌ అయ్యాయంటే. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఎస్‌బీఐ ఏటీఎమ్‌(SBI ATM) కార్డులను వసూలు చేస్తోంది. ఎస్‌బీఐ(SBI) క్లాసిక్‌, సిల్వర్‌, గ్లోబల్‌ వంటి కార్డులకు సంబంధించిన వార్షిక రుసుము రూ. 200గా ఉంటుంది. ఈ మొత్తాన్ని ఎస్‌బీఐ వసూలు చేసిందన్నమాట. అయితే రూ. 236 ఎందుకు కట్‌ చేశారన్న సందేహం వస్తోంది కదూ! ఈ ట్రాన్సాక్షన్‌పై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తుంది. దీని ప్రకారం 18 శాతం అంటే రూ. 36 ట్యాక్స్‌ ఉంటుందన్నమాట. ఇలా మొత్తం రూ. 236 అకౌంట్‌ నుంచి కట్‌ అవుతున్నాయన్నమాట. అయితే ఈ మెయింటెనెన్స్‌ ఛార్జీలు అనేవి మనం ఉపయోగించే కార్డ్‌ రకంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఖాతాలో సరిపడ అమౌంట్‌ లేకపోతే బ్యాలెన్స్‌ మైనస్‌ అవుతుంది. 

 

ఇది కూడా చదవండి: ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా.. బీఏసీ సమావేశం ప్రారంభం!

 

యూపీఐ పేమెంట్స్‌ విషయంలో కూడా..

ఇదిలా ఉంటే ఎస్బీఐ యూపీఐ పేమెంట్స్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రోజువారీ యూపీఐ లావాదేవీ పరిమితిని అమలు చేసింది. దీని ప్రకారం యూజర్లు రోజుకు గరిష్టంగా 10 లావాదేవీలు చేసుకోవచ్చు. గరిష్టంగా రూ. లక్ష వరకు ట్రాన్సాక్షన్‌ చేసుకోవచ్చు. అయితే ఈ మొత్తాన్ని పెంచుకోవాలంటే ఎస్‌బీఐకి చెందిన యోనో యాప్‌ ద్వారా లావాదేవీ చేసుకోవచ్చు. 

 

ఏ కార్డుకు ఎంత కట్ అవుతుంది.

క్లాసిక్, సిల్వర్‌ గ్లోబల్‌ కార్డులకు రూ. 236 కట్‌ చేసుకుంటారు. అలాగే యువ/గోల్డ్/కాంబో/మై కార్డ్ కోసం రూ. 250తో పాటు అదనంగా జీఎస్‌టీ వసూలు చేస్తారు. ఇక ప్లాటినం కార్డులకు ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కార్డులపై మొత్తం రూ. 350తో పాటు జీఎస్‌టీ వసూలు చేస్తారు. గరిష్టంగా ప్రైడ్‌, ప్రీమియం కార్డులపై ఏకంగా రూ. 425తో పాటు అదనంగా జీఎస్‌టీని వసూలు చేస్తారు. అయితే కొందరికి ఈ డబ్బు డెబిట్‌కు సంబంధించి మెసేజ్‌లు కూడా వస్తున్నాయి అకౌంట్ మెయింటెనెన్స్‌ ఛార్జ్‌ పేరుతో డబ్బులు కట్ అయినట్లు సందేశాలు వస్తున్నాయి. 

 

ఇది కూడా చదవండి: జగన్ కి మరో షాక్.. కిడ్నాప్, హత్యాయత్నం కేసులో వైసీపీ నేత అరెస్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SBI #Bank #India